సస్పెన్షన్‌కు గురైన ఈఓ ఆత్మహత్య

2 Feb, 2017 22:46 IST|Sakshi
సస్పెన్షన్‌కు గురైన ఈఓ ఆత్మహత్య
 • మనస్తాపం చెంది ఎలకల మందు తాగిన వైనం
 • భర్త మృతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు
 • రాజానగరం/కోరుకొండ/అనపర్తి : 
  దేవాలయ సొమ్ములు దుర్వినియోగం చేశారనే అభియోగంపై సస్పెండైన బొల్లెంపల్లి వెంకటేశ్వర్రావు (56) ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయిస్తుండగా బుధవారం రాత్రి 1.45 గంటల  సమయంలో మృతి చెందినట్టు రాజానగరం పోలీసులు తెలిపారు.
  రాజమహేంద్రవరం రూరల్‌ మండలం, కొంతమూరులో నివాసం ఉంటున్న తల్లిదండ్రులను చూసేందుకు వచ్చిన వెంకటేశ్వర్రావు గత నెల 30న బయటకని వెళ్లి కొద్దిసేపటికి తిరిగి వచ్చి వాంతులు చేసుకున్నారు. అదేమని ప్రశ్నించిన  తల్లిదండ్రులకు, భార్యకు తాను ఎలుకల మందు తాగినట్టు తెలిపారు. దీనితో వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
  కోరుకొండ మండలం, నర్సాపురానికి చెందిన ఆయన అనపర్తిలో కాపురం ఉంటూ, బలభద్రపురం ఊళ్లపల్లి గ్రూప్‌ ఏరియాకు దేవదాయశాఖ ఈఓ (గ్రేడ్‌–2) గా పనిచేస్తున్నారు. అనపర్తి మండలం మహేంద్రవాడలోని వేణుగోపాల, రామలింగేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో రూ. 33 లక్షలు దుర్వినియోగం చేశారన్న అభియోగంపై మానసికవేదనతో ఉన్న అతనిని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారు. అలాగే అతని స్థానంలో వేరొక ఈఓను ఇ¯ŒSచార్‌్జగా నియమించడంతో వెంకటేశ్వర్రావు మనస్తాపానికి గురై ఆత్మహత్య నిర్ణయానికి వచ్చి చివరి చూపుగా తల్లిదండ్రులను చూడాలని కొంతమూరు వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తన భర్తపై లేనిపోని నిందమోపడంతోనే ఇలాజరిగిందంటూ అతని భార్య శుభలక్ష్మి భోరున విలపించారు.  ఇదేవిషయమై దేవాదాయ శాఖ కమిషనరు, జిల్లా డిప్యూటీ కమిషనర్‌లకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తమకు ఆసరా ఉంటాడనుకున్న కొడుకు ఇలా మృతి చెందడాన్ని అతని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసును రాజానగరం హెచ్‌సీ సాయిసుబ్రహ్మణ్యం దర్యాప్తు చేస్తున్నారు. 
  నర్సాపురంలో అంత్యక్రియలు
  పోస్టుమార్టమ్‌ అనంతరం వెంకటేశ్వర్రావు మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించడంతో ఆయన స్వగ్రామైన కోరుకొండ, నర్సాపురంలో అంత్యక్రియలు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్‌ అధికారుల  సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు పి. విశ్వనాథ్‌రాజు, నరసింహంబాబు, పల్లం రాజు, బొక్కా వెంకటేశ్వరరావు తదితరులు బాధిత కుటుంబ సభ్యులను కలుసుకుని తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. 
   
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా