ఎంసెట్‌–2 లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలి

29 Jul, 2016 23:43 IST|Sakshi
ఎంసెట్‌–2 లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలి
  • పాపిరెడ్డి, కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను బర్తరఫ్‌ చేయాలి
  • టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు
  • వరంగల్‌ : ఎంసెట్‌–2 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించి అందుకు బాధ్యులను చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  లకా్ష్మరెడ్డిలను వెంటనే పదవుల నుంచి బర్తరఫ్‌ చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు డిమాండ్‌ చేశారు. హన్మకొండ బాలసముద్రంలోని టీడీపీ జిల్లా కార్యాలయం లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలా ది మంది విద్యార్థుల తల్లిదండ్రులతో కంటతడి పెట్టిస్తున్న ఎంసెట్‌ లీకేజీ కుంభకోణంలో అస లు ముద్దాయి ప్రభుత్వమే అని, ఇందుకు బా ధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. చైర్మన్, డి ప్యూటీ సీఎం, వైద మంత్రి ప్రమేయం ఉన్నప్పటికి వారిని కాపాడేందుకు దళారులు ప్రింటింగ్‌ ప్రెస్‌కు సంబంధించిన వ్యక్తులను, కొంత మం ది విద్యార్థులను బలిపశువులుగా చేస్తూ తప్పిం చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎంసెట్‌ ఆన్‌లైన్‌ కోసం సంబంధించిన టెండర్‌ను ప్రభుత్వ రంగ సంస్థకు అప్పజెప్పకుండా ఏకపక్షంగా ప్రైవేటు సంస్థకు అప్పగించడం వె నుక ముఖ్యమంత్రి కుటుంబ పెద్దల ఒత్తిడి ఉం దని ఆరోపించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్, తెలుగు రైతు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడుచాడా రఘునాథరెడ్డి, హన్మకొండ సాంబ య్య, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటో త్‌ సంతోష్‌నాయక్,కార్యాలయ కార్యదర్శి మార్గం సారం గం, ఎర్రబెల్లి రామేశ్వర్‌రావు, రాజగోపాల్, వల్లెపు శ్రీనివాస్, తాళ్లపల్లి రాజు, జయశంకర్‌ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు