పేదల అభ్యున్నతికి కృషి

17 Nov, 2016 23:53 IST|Sakshi
పేదల అభ్యున్నతికి కృషి
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్‌ కనెక‌్షన్లు
– పథకం ప్రారంభోత్సవంలో  ఉప ముఖ్యమంత్రి కేఈ
కర్నూలు(అగ్రికల్చర్‌): పేదల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ క​ృషి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి కేఈ క​ృష్ణమూర్తి అన్నారు. అందులో భాగంగానే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక‌్షన్లు ఇస్తున్నారని చెప్పారు. మన జిల్లాకు 10వేల గ్యాస్‌ కనెక‌్షన్లు మంజూరు అయ్యాయని ఆయన ప్రకటించారు. గురువారం కర్నూలు వెంకటరమణ కాలనీలోని పర్యాటక సంస్థకు చెందిన హరిత గెస్ట్‌హౌస్‌లో ఉజ్వల యోజన పథకాన్ని ఆయన  ప్రారంభించారు. మొదటి రోజు 200 గ్యాస్‌ కనెక‌్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దారిద్య్రరేఖకు దిగువనున్న  మహిళలు ఆధార్‌ నంబరు, బ్యాంకు పాసు పుస్తకం చూసిస్తే ఎలాంటి డబ్బు లేకుండా గ్యాస్‌ కనెక‌్షన్‌ ఇస్తారనా​‍్నరు. జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ మాట్లాడుతూ... మహిళల సంక్షేమం లక్ష్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. వంటకు కట్టెలను వాడటంతో మహిళల ఆరోగ్యంతో పాటు అడవులు దెబ్బతింటున్నాయని చెప్పారు.  గ్యాస్‌ కనెక‌్షన్లు లేనివారు తహసీల్దారు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఐఓసీ ఏరియా మేనేజర్‌ మీరనాయర్‌ మాట్లాడుతూ... 18 ఏళ్లు పైబడిన నిరుపేద మహిళలకు సిలిండరు, గ్యాస్, రెగ్యులేటరు, లైటర్, పాస్‌ పుస్తకం ఉచితంగా ఇస్తామని తెలిపారు. గ్యాస్‌ స్టవ్‌కు రూ.990, గ్యాస్‌కు రూ.600 కేంద్రం లోన్‌ ఇస్తుందని తెలిపారు. లోన్‌ తీరే వరకు వీరికి గ్యాస్‌ సబ్సిడీ రాదని అది కేంద్రానికి వెలుతుందన్నారు.  గ్రామాల్లోనే క్యాంపులు పెట్టి గ్యాస్‌ వినియోగంపై అవగాహన కల్పించిన తర్వాతనే కనెక‌్షన్లు ఇస్తామని వెల్లడించారు.   సమావేశంలో డీఎస్‌ఓ తిప్పేనాయక్, ఐఓసీ సేల్స్‌ ఆఫీసర్‌ హరికృష్ణ, హెచ్‌ఓపీ సేల్స్‌ ఆఫీసర్‌ మురళీమోహన్, బీఓపీ టెరిటరీ మేనేజర్‌ దిలీఫ్, సేల్స్‌ ఆఫీసర్‌ సురేష్, గ్యాస్‌ డిస్ట్రిబ్యూటరీలు రమేష్‌గౌడు, శ్వేత, వెంకటేశ్వరరెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు