టీచర్ల సమస్యలపై ముందుండి పోరాడుతా

28 Feb, 2017 04:09 IST|Sakshi

ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవీఎన్  రెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లా: విద్యారంగంలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యలను పరిష్కరించడానికి శాయశక్తులా కృషిచేస్తాన ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవీఎన్ న్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దశాబ్ద కాలంగా ఉపాధ్యాయుల సమస్యల్లో ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. ఏళ్ళ తరబడి ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ కార్యరూపం దాల్చకపోవడంతో పదోన్నతులు లేక క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థ గాడి తప్పిందన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేకపోతే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా లభిస్తుందని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయడానికి పావులు కదుపుతోందని ఆరోపించారు. ప్రతి మండలానికో గురుకులాన్ని ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడికి పోవాలన్నారు. దేశంలోనే ధనిక రాష్ట్రంగా చెపు్పకుంటున్న తెలంగాణలో కరువు భత్యం, 9నెలల పీఆర్‌సీ బకాయిలు నేటికీ చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.  సిట్టింగ్‌ ఎమ్మెల్సీ గడిచిన ఆరేళ్లలో ఏం సాధించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మళ్లీ అధికార పార్టీ అండదో బరిలోకి దిగడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. విద్యా రంగం, ఉపాధ్యాయ లోకం ఎదుర్కొంటున్న 20 అంశాలతో కూడిన మ్యానిఫేస్టోను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తనను ఎన్నుకుంటే విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని చెప్పారు.

మరిన్ని వార్తలు