చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ పించాలి

28 Feb, 2017 04:06 IST|Sakshi

షాద్‌నగర్‌: చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం దక్షి ణ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మద్దూరి అశోక్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంట్‌లో ఆమోదం చేయించేందుకు ఢిల్లీకి అఖిలపలక్షాన్ని తీసుకుపోవాలని కోరారు. ఆదివారం షాద్‌నగర్‌ పట్టణంలోని సంఘం కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలిసి బీసీ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేయాలన్నారు.

పార్లమెంట్‌లో 36 రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ఏ ఒక్క పార్టీ బీసీల పక్షాన మాట్లాడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించిన పాపాన పోవడంలేదన్నారు. విదేశీయులకు ఉన్న గౌరవం బీసీలకు లేకుండాపోయిందని ఆరోపించారు. దాదాపు 2,600 బీసీ కులాలు ఉంటే, అందులో 2,550 కులాలు పార్లమెంట్, అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదన్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో వెనుకబాటు తనమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాలలో 27 శాతం, పంచాయతీరాజ్, మున్సిపల్‌ ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు.  ఈ సమావేశంలో నాయకులు మేడిగశ్రీను, నర్సింలుయాదవ్, సాయియాదవ్, శివ, రఘు, రాజేందర్, జగన్, సురేష్, పాషా, మీరాజ్, రఫీ, శ్రీకాంత్‌గౌడ్, రాములు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు