ఆధునిక పద్ధతులు అనుసరణీయం

26 Sep, 2016 22:23 IST|Sakshi
ఆధునిక పద్ధతులు అనుసరణీయం
– ప్రకృతి వ్యవసాయంపై ప్రొఫెసర్‌ శ్రీనివాసరెడ్డి
 
నంద్యాలరూరల్‌: ప్రకృతి వ్యవసాయం ఆధునిక పద్ధతులు అనుసరణీయమని వేదశాస్త్ర విజ్ఞాన పరిశోధనా సంస్థల ప్రొఫెసర్‌ శ్రీనివాసరెడ్డి అన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సోమవారం ప్రాచీన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, ఆధునిక యుగంలో అనుసరణీయత అన్న అంశంపై   రైతు శిక్షణ  శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి శ్రీనివాసరెడ్డి ముఖ్యాతిథిగా హాజరయ్యారు. కాలానుగుణంగా సాగు విధానాలు కూడా మార్చుకోవాలన్నారు. ఉద్యాన పంటలు, మూలికల సేద్యం చేపట్టాలని రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయానికి దేశీవాలి ఆవు కీలకమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పశుపోషణ చేపట్టాలన్నారు. జీవామృతం తయారు చేసుకొనే విధానాన్ని రైతులకు వివరించారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ సీనియర్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ రామారెడ్డి, డాక్టర్‌ నాగరాజరావు, సరళమ్మ, మునిరత్నం, జయలక్ష్మి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు ప్రకృతి వ్యవసాయం కూడా చేపట్టాలని రైతులకు సూచించారు. శిక్షణా శిబిరంలో నంది రైతు సమాఖ్య నాయకులు ఉమామహేశ్వరరెడ్డి, అప్పిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు