పాస్ బుక్కులకు బ్రేక్!

15 Jul, 2016 02:25 IST|Sakshi
పాస్ బుక్కులకు బ్రేక్!

వెబ్‌ల్యాండ్ అప్‌డేషన్  తర్వాతే పంపిణీ
ఈ -పాస్‌బుక్కులపై సర్కారు కసరత్తు
రెవెన్యూ రికార్డులను సరిదిద్దకుండా జారీచేస్తే కొత్త సమస్యలు

రాష్ర్టం ఏర్పడిన తర్వాత జిల్లాలో 60వేల పట్టాదారు పాసు పుస్తకాలను రెవెన్యూ యంత్రాంగం ముద్రించింది. వీటిలో ఇప్పటివరకు దాదాపు 35వేల మంది రైతులకు అందజేసింది.

జిల్లావ్యాప్తంగా ఉన్న 11,12,029 సర్వేనంబర్లకు సంబంధించి ఆరు లక్షల క్లెరుుమ్‌లు అధికారుల దృష్టికి వచ్చారుు. వీటిన్నింటిని సవరించి కంప్యూటరీకరించడమే సవాలుగా మారింది.

పట్టాదారు పాస్‌పుస్తకాల జారీకి ప్రభుత్వం బ్రేక్ వేసింది. రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ నేపథ్యంలో పాస్‌పుస్తకాల జారీని నిలిపివేసింది. త్వరలోనే ఈ-పాస్ బుక్కులను అందుబాటులోకి తేవాలని భావిస్తున్న సర్కారు.. ప్రస్తుతం జారీచేస్తున్న వాటికి మంగళం పాడాలని నిర్ణరుుంచింది. ఈ మేరకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ రేమాండ్‌పీటర్ ఉత్తర్వులు జారీచేయడంతో జిల్లాలో  పాసుపుస్తకాల పంపిణీ ఆగిపోరుుంది. 

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం దాదాపు ఏడాదిపాటు కొత్త పాసు పుస్తకాలను ప్రభుత్వం జారీ చేయలేదు. ప్రభుత్వ చిహ్నం మార్పు తదితర కారణాల వల్ల పుస్తకాల ముద్రణ ఆలస్యమైంది. దీంతో భూ క్రయవిక్రయాలు జరిగినా యాజమాన్య హక్కుల్లో కీలకంగా భావించే పాసు పుస్తకాలను ఇవ్వకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.  

ఇప్పట్లో కష్టమే! తప్పులతడకగా ఉన్న రెవెన్యూ రికార్డులను సరిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఇందుకనుగుణంగా  ప్రతి భూమి చరిత్ర, పట్టాదారు, అనుభవదారులు, పహనీల్లో నమోదైన పేర్లను కంప్యూటరీకరించాలని భావించింది. ఈ మేరకు వెబ్‌ల్యాండ్ అప్‌డేషన్  పేరిట సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీనికి అనుగుణంగా క్షేత్రస్థారుులో సర్వే చేసిన రెవెన్యూ సిబ్బంది ప్రతి సర్వే నంబర్ భూమి పుట్టుపుర్వోత్తరాలను సేకరించారు. అదేసమయంలో రికార్డుల్లో మార్పులు, చేర్పులను కూడా నమోదు చేసుకున్నారు. ఇవేకాకుండా అభ్యంతరాలను కూడా తెలుసుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 11,12,029 సర్వేనంబర్లకు సంబంధించి ఆరు లక్షల క్లెరుుమ్‌లు అధికారుల దృష్టికి వచ్చారుు. వీటిన్నింటిని సవరించి కంప్యూటరీకరించడం ద్వారా రెవెన్యూ రికార్డులను పకడ్బందీగా తయారు చేయాలని ప్రభుత్వం అనుకుంది. ఇంతవరకు ప్రక్రియ సజావుగానే సాగినా.. సేకరించిన సమాచారాన్ని కంప్యూటరీకరించడం రెవెన్యూ అధికారులకు తలకుమించిన భారంగా మారింది. 

ఆరు లక్షల క్లెరుుమ్‌లు
జిల్లావ్యాప్తంగా ఆరు లక్షల సవరణలు రావడం, వీటన్నింటిని కంప్యూటర్లలో అప్‌లోడ్ చేయడంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. దీంతో వెబ్‌ల్యాండ్ అప్‌డేషన్ లో జిల్లా వెనుకబడింది. ఈ ప్రక్రియంతా పూర్తరుుతేనే.. ఈ -పాస్‌పుస్తకాల జారీకి సార్థకత చేకూరుతుంది. క్షేత్రస్థారుులో వెలుగులోకి వచ్చిన తప్పులను సరిదిద్దుకోకుండా.. సవరించిన వాటినీ కంప్యూటరీకరించకుండా ఈ- పట్టాదారు పాస్‌పుస్తకాలను ఇవ్వాలనుకుంటే మాత్రం సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది.

ఈ -పుస్తకాల్లోనే సమగ్ర సమాచారాన్ని పొందుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పట్టాదారుకు సంబంధించిన పహనీల్లో సదరు భూమిపై ఏమైనా రుణాలు తీసుకున్నారా? బ్యాంకుల్లో ఏమైనా కుదవ పెట్టారా? తదితర సమాచారాన్ని కూడా ఆ పుస్తకంలో నమోదు చేయనున్నారు. ఈ సమాచారాన్ని ఆన్ లైన్ లో ఎవరైనా పరిశీలించుకునే వెసులుబాటు కలగనుంది. ముఖ్యంగా బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు, ఇతరులు కూడా సంబంధిత సర్వే నంబర్ భూమి వివరాలను ఆన్ లైన్ లో పరిశీలించుకోవచ్చు. రికార్డులన్నీ సవరించిన తర్వాత ఈ -పాస్ పుస్తకాలను జారీచేస్తే బాగుంటుంది తప్ప.. వాటిని గాలికొదిలేసి.. ప్రస్తుతం మాన్యువల్‌గా ఇస్తున్న పీటీ బుక్కులను నిలిపివేయాలనే నిర్ణయం సరికాదని రైతులు అంటున్నారు. 

మరిన్ని వార్తలు