తిరుమల, శ్రీకాళహస్తిలో హై అలర్ట్

1 Jul, 2016 10:51 IST|Sakshi

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్ నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీకాళహస్తిలో ఉన్నతాధికారులు హై అలర్ట్ ప్రకటించారు. సదరు పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అలాగే తిరుమలలో జీఎన్సీ టోల్గేట్ వద్ద పోలీసులు ప్రతి వాహనాన్ని క్షణంగా తనిఖీలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు