దేశ ఔన్నత్యాన్ని చాటాలి

20 Jul, 2016 01:26 IST|Sakshi
దేశ ఔన్నత్యాన్ని చాటాలి
హిందూపురం టౌన్‌ : హిందువులు స్వాభిమానం, దేశభక్తిని పెంపొందించుకుని ప్రపంచ దేశాల్లో భారతదేశం ఔన్నత్యాన్ని చాటాలని తిరువణ్ణామలై శ్రీవత్స పీఠం స్వామీజీ శ్రీవాత్యల్స వాసవదత్త పేర్కొన్నారు. మంగళవారం విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో స్థానిక సూగురు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద హిందూ ధర్మ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనానికి వైటీ శ్రీనివాసులు అధ్యక్షత వహించగా అతిథులుగా స్వామీజీ శ్రీవాత్యల్స వాసవదత్త, విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ సహాయ కార్యదర్శి రాఘవులు పాల్గొని ధర్మ ప్రభో దం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించేలా ప్రభుత్వాలు  చర్యలు చేపట్టి దేశ ప్రజల భద్రతను కాపాడాలన్నారు. సనాతన హిందూ ధర్మం, తల్లి, గోమాత, మాతృభూమి, గ్రంథాలు, మంది రాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు.∙హిం దూవుల ధర్మ సంసృ ్కతులపై, జీవన విలువలపై దాడులు జరుగుతున్నాయని, హిందువులంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు.  కార్యక్రమంలో చారుకీర్తి, డీఈ రమేష్, నవీన్‌కుమార్, విశ్వహిందూ పరిషత్‌ నాయకులు, హిందువులు పెద్దఎత్తున పాల్గొన్నారు.  
 
>
మరిన్ని వార్తలు