రెండో మద్యం డిపో ప్రారంభానికి బాలారిష్టాలు

16 Jan, 2017 23:23 IST|Sakshi
రెండో మద్యం డిపో ప్రారంభానికి బాలారిష్టాలు
  •  హమాలీల నియామకం విషయంలో వివాదం
  •  వెనుదిరిగిన మద్యం లారీలు
  •  పండగ అనంతరం సన్నాహాలు
  • నెల్లూరు(క్రైమ్‌): గూడూరు ఎక్సైజ్‌ జిల్లాలో రెండో మద్యం డిపో నిర్మాణం పూర్తయింది. ఈనెల మొదటివారంలో ప్రారంభించాల్సి ఉంది. అయితే  హమాలీల నియామక విషయంలో వివాదం చెలరేగడంతో ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో డిపోకు వచ్చిన 30 లారీల మద్యం దేవరపాలెం ఐఎంఎల్‌ డిపోకు తరలింది. జిల్లాలో 336 మద్యం దుకాణాలు 42 బార్లు ఉన్నాయి. వీటన్నింటికీ నెల్లూరు ఎౖMð్సజ్‌ జిల్లా పరిధిలోని దేవరపాలెం ఐఎంఎల్‌ డిపో నుంచే మద్యం, బీరు సరఫరా అవుతోంది.

    గూడూరు సబ్‌డివిజన్‌ పరిధిలోని తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడి నుంచే మద్యం ఏన్నోఏళ్లుగా తీసుకెళుతున్నారు. కొంతకాలంగా ఖర్చు అధికమవుతుండటం వ్యాపారులకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గూడూరు ఎక్సైజ్‌ జిల్లా  పరిధిలోని ఓజిలిలో రెండో మద్యం డిపో ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. నిర్మాణ పనులు పూర్తయ్యాయి.  

    141 మద్యం దుకాణాలకు సరఫరా
     గూడూరు జిల్లాలోని 141 మద్యం దుకాణాలకు, నాలుగుబార్లకు ఓజిలి నుంచే మద్యం సరఫరా అవుతోంది. దీంతో వ్యాపారుల్లో ఆనందం నెలకొంది. ఈ నెల మొదటివారంలో ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేశారు. 30 లారీల మద్యాన్ని సైతం తెప్పించారు. అయితే హమాలీల నియామక విషయంలో నెలకొన్న వివాదంతో ప్రారంభానికి బ్రేక్‌ పడింది. దీంతో మద్యాన్ని దేవరపాలెంలోని డిపోకు తరలించారు. డిపోలో పనిచేసేందుకు  çసుమారు 80మంది లోడింగ్, అన్‌లోడింగ్‌ చేసేందుకు హమాలీలు అవసరం. హమాలీల నియామకాల్లో 80శాతం స్థానికులకు, 20శాతం స్థానికేతరులకు అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలో హమాలీల  నియామక బాధ్యతలు జేసీ చేపట్టారు. పదోతరగతి ఉత్తీర్ణులై, 40 ఏళ్లలోపు వారినే నియమించేందుకు చర్యలు చేపట్టారు. స్థానికేతరులకు ఎలాంటి పరిస్థితుల్లో అవకాశం కల్పించరాదని, తమనే నియమించాలని, అధికారపార్టీ నేతలు సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండా నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలని  సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన  చేపట్టారు.

    దీంతో డిపో ప్రారంభానికి నోచుకోలేదు. గత కొద్దిరోజులుగా అధికారులు, కార్మిక నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయి.  సంక్రాంతి పండగ అనంతరం డిపోను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయమై నెల్లూరు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ టి.శ్రీనివాసరావును వివరణ కోరగా హమాలీల నియామకం విషయంలో కొంత సమస్య ఉందని అది త్వరలోనే కొలిక్కి వస్తుందన్నారు. పండగ అనంతరం డిపోను ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు.

మరిన్ని వార్తలు