ఉత్తమ సేవలతోనే గుర్తింపు

18 Apr, 2017 22:07 IST|Sakshi
ఉత్తమ సేవలతోనే గుర్తింపు

- సీమ ఐజీ శ్రీధర్‌రావు
కర్నూలు : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వారికి పోలీసు శాఖలో మంచి గుర్తింపు ఉంటుందని రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు అన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది 2017 పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పోలీసు శాఖలోని డీఎస్పీలు, పోలీసు సిబ్బందికి పలు సేవా పతకాలను జారీ చేసింది. మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో ఉత్తమ సేవ, సేవా పతకాలు సాధించిన డీఎస్పీలు, పోలీసు సిబ్బందిని ఐజీ శ్రీధర్‌రావు, డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణ నేతృత్వంలో అభినందన సభ నిర్వహించి సత్కరించారు.

ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ పోలీసుల పనితీరును గుర్తించడానికి డీజీపీ సాంబశివరావు ఆదేశాల మేరకు ఏ,బీ,సీ,డీ అవార్డులు అందజేస్తున్నారన్నారు. మంచి పనులు చేసేవారిని గుర్తించాలని సూచించారు. డీఐజీ రమణకుమార్‌ మాట్లాడుతూ సేవా పతకాలు సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకుని జిల్లా పోలీసులందరూ బాగా పనిచేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని సూచించారు. విధి నిర్వహణ, కేసుల పరిశీలనలో టెక్నాలజీని ఉపయోగించాలన్నారు.


సన్మాన గ్రహీతలు...
డీఎస్పీలు...
 రాజశేఖర్‌రాజు (డీటీసీ) ఇండియన్‌ పోలీస్‌ పతకం, బాబు ప్రసాద్‌ (స్పెషల్‌ బ్రాంచ్‌) ఉత్తమ సేవా పతకం, కె.ఎస్‌.వినోద్‌కుమార్‌ (ఆత్మకూరు ఇన్‌చార్జి) సేవా పతకం.
సీఐలు...
పార్థసారధి రెడ్డి (పాణ్యం) సేవా పతకం, ఆర్‌.శివారెడ్డి (ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో) సేవా పతకం.
ఏఎస్‌ఐలు...
 ఎల్‌.రఘురామయ్య (స్పెషల్‌ బ్రాంచ్‌) సేవా పతకం, రంగయ్య (స్పెషల్‌ బ్రాంచ్‌) సేవా పతకం.
హెడ్‌ కానిస్టేబుళ్లు..
డి.మౌలాలి (స్పెషల్‌ బ్రాంచ్‌–2) ఉత్తమ సేవా పతకం, రఘురామయ్య గౌడు (సీసీఎస్‌) ఉత్తమ సేవా పతకం, ఉస్మాన్‌ బాషా(ఓఎస్‌డీ ఆఫీస్‌) సేవా పతకం, వెంకటాచలపతి (ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో) సేవా పతకం, వసూరప్ప (డీసీఆర్‌బీ) సేవా పతకం.
కానిస్టేబుళ్లు...
పి.వెంకటేశ్వర్లు (స్పెషల్‌ బ్రాంచ్‌–2) సేవా పతకం, రామాంజనయ్య (డోన్‌ పీఎస్‌) సేవా పతకం, ఫయాజుద్దీన్‌ (కర్నూలు తాలూకా పీఎస్‌) సేవా పతకం, బి.వి.రామరాజు (డీటీసీ) సేవా పతకం.   
 

>
మరిన్ని వార్తలు