‘సుంకేసుల’కు పెరిగిన ఇన్‌ఫ్లో

15 Sep, 2016 22:53 IST|Sakshi
‘సుంకేసుల’కు పెరిగిన ఇన్‌ఫ్లో
సుంకేసుల(గూడూరు): మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా తుంగభద్రనది ద్వారా సుంకేసుల రిజర్వాయర్‌కు నీరు చేరుతోంది. గురువారం డ్యాంకు 2700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు డ్యాం ఏఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీ కాల్వకు 2600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.  రిజర్వాయర్‌ గేటును అర మీటర్‌‡మేర ఎత్తి దిగువకు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఇన్‌ఫ్లో కొనసాగే అవకాశం ఉందన్నారు. 
 
మరిన్ని వార్తలు