ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలి

27 Jul, 2016 22:49 IST|Sakshi
ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలి

ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను

ఘట్‌కేసర్‌ టౌన్‌: పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా వసతి గృహాల్లోని విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఉత్తర కమిటీ ఆధర్యంలో జూలై 24న సికింద్రాబాద్‌లో ప్రారంభమైన సైకిల్‌యాత్ర మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్, శామీర్‌పేట్‌, కీసర మండలాల్లో మండలాల్లో కొనసాగి ఘట్‌కేసర్‌లో బుధవారం జరిగిన ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ గృహాల్లోని విద్యార్థులకు రోజుకు ఒక్కంటికి రూ. 27 తో మూడు పూటలా భోజనం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. విద్యార్థులకు ప్రస్తుతమిస్తున్న కాస్మొటిక్‌ చారీ‍్జలను పెంచాలన్నారు. అద్దె భవనాలు, ఇన్‌చార్జి వార్డెన్లతో విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారని, శాశ్వత వార్డెన్లను నియమించాలని, శాశ్వత భవనాలను నిర్మించాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అనుసరించి కేజీ - పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగేశ్వర్‌, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు నరేష్‌ మాట్లాడుతూ వారానికి ఒకసారి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయాలని, ఘట్‌కేసర్‌లో మూసిన బీసీ విద్యార్థి వసతి గృహాన్ని తక్షణమే తెరిపించాలన్నారు. బంగారు తెలంగాణ అంటే విద్యారంగాన్ని కార్పొరేటుకు అప్పగించడమేనా అన్ని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని మేడ్చల్‌, ఘట్‌కేసర్‌ మండలాల్లో డిగ్రీ కళాశాలలను ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శ్రీకాంత్‌, శేఖర్‌, ప్రశాంత్‌, గౌతం, లక్ష్మణ్‌, వెంకటేష్‌, నర్సింహ, రమేష్‌ పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు