మళ్లీ ఇంజక్షన్ సైకో కలకలం!

11 Sep, 2015 18:13 IST|Sakshi
మళ్లీ ఇంజక్షన్ సైకో కలకలం!

భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఇంజక్షన్ సైకో కలకలం సృష్టిస్తున్నాడు. భీమవరంలో ముగ్గురు వ్యక్తులు బ్లాక్ పల్సర్ పై సంచరిస్తుండగా గ్రామస్తులు వారిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంజక్షన్ సైకో అనే అనుమానంతో వీరిని గ్రామస్తులు వెంబడించి, ఇద్దరిని పట్టుకోగా, ఒకరు పరారైనట్లు సమాచారం. గ్రామస్తులు వెంబడిస్తున్న సమయంలో వారు పల్సర్ బైకును వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించగా ఇద్దరు దొరికినట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని నరసాపురం డీఎస్పీ విచారణ చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు వ్యక్తులపై గతంలో పలు కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైందని ఓ అధికారి తెలిపారు.

జిల్లాలోని పెంటపాడు మండలం కొండేపాడు గ్రామంలో అల్లూరి పాపారావు అనే వ్యక్తిపై గురువారం సిరంజీ సైకో దాడి చేసిన విషయం విదితమే. హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఆయన తొడపై సిరంజీతో గుచ్చి పారిపోయిన ఘటన మరువకముందే భీమవరం మండలంలో ఇంజక్షన్ సైకో సంచారం కలకలం సృష్టిస్తోంది.
 

మరిన్ని వార్తలు