'లింబయ్యకు ఒక్క రూపాయి అప్పులేదు' | Sakshi
Sakshi News home page

'లింబయ్యకు ఒక్క రూపాయి అప్పులేదు'

Published Fri, Sep 11 2015 5:11 PM

pocharam statement on limbaiah suicides

హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. రైతు యూనిట్గా పంటల బీమా వసూలు చేసినప్పుడే ఆత్మహత్యలు తగ్గుతాయని ఆయన తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడుతూ.. స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు ధరల స్థిరీకరణ చేయాలన్నారు.

ట్యాంక్బండ్ వద్ద ఆత్మహత్య చేసుకున్న రైతు లింబయ్యకు ఒక్క రూపాయి కూడా అప్పు లేదని ఆయన తెలిపారు. లింబయ్య గత 8 ఏళ్లుగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్టు తేలిందని చెప్పారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే 20 శాతం తక్కువగా ఉందన్నారు. గత ఏడాదిన్నర కాలంలో 490 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement