ఐఎన్టీయూసీని ఆదరించాలి

25 Jul, 2016 18:01 IST|Sakshi
మాట్లాడుతున్నవెంకట్రావు
  • వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి వెంకట్రావు
  • ఆర్కే 5గనిపై గేట్‌ మీటింగ్‌
  • శ్రీరాంపూర్‌ : వచ్చే ఎన్నికల్లో కార్మికులు ఐఎన్టీయూసీని ఆదరించాలని ఆ యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.వెంకట్రావు తెలిపారు. సోమవారం ఆయన ఆర్కే 5 గనిపై నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో కార్మికులనుద్దేశించి మాట్లాడారు. తాము గుర్తింపు సంఘంగా ఉన్న హయాంలోనే కార్మికులకు 40 హక్కులు సాధించామని అన్నారు. ఆ తర్వాత గెలిచిన సంఘాలన్నీ కార్మికుల హక్కులు కాలరాస్తున్నాయని విమర్శించారు. టీబీజీకేఎస్‌ పూర్తిగా విఫలమైందని, వారి అసమర్థత వల్ల నేడు ప్రైవేటీకరణ పెరిగిందని పేర్కొన్నారు. గనులు కూడా ప్రైవేటు పరం కాబోతున్నాయని ఆరోపించారు.
     
    9వ వేజ్‌బోర్డులో కార్మికులకు మెరుగైన జీతాలు అందించడానికి జాతీయ సంఘాలు కృషి చేశాయని, 10వ వేజ్‌బోర్డులో కూడా మెరుగైన వేతనాల కోసం కలిసికట్టుగా కృషి చేస్తున్నాయని తెలిపారు. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, సకల జనుల సమ్మె వేతనాలు చెల్లించాలని, స్వంతింటి పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధన కోసం అవసరమైతే అన్ని సంఘాలను కలుపుకొని సమ్మె చేస్తామని తెలిపారు.
     
    సమావేశంలో యూనియన్‌ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు డి.అన్నయ్య, బ్రాంచి ఉపాధ్యక్షులు జి.మహిపాల్‌రెడ్డి, అద్దు శ్రీనివాస్, అశోక్, బోనగిరి కిషన్, ఫిట్‌ సెక్రెటరీ ఆనందం, నాయకులు గంగయ్య, రమేశ్, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు