జేఎన్‌టీయూ-కే ఖోఖో బాలికల జట్టు ఎంపిక

24 Jan, 2017 23:32 IST|Sakshi
గుడ్లవల్లేరు(గుడివాడ): కాకినాడ జేఎన్‌టీయూ ఖోఖో బాలికల జట్టును మంగళవారం గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఎంపిక చేశారు. ఎనిమిది జిల్లాల్లోని అనుబంధ కళాశాలల నుంచి 70 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. జేఎన్‌టీయూ-కె జట్టుకు కె.పూర్ణ, ఎస్‌.తులసి (దువ్వాడ విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌), సీహెచ్‌ నవ్యశ్రీ,, కె.బాలనాగమ్మ (కోరంగి కైట్‌), టి.పండు (నూజివీడు సారధి), ఎం.శ్రీదేవి, ఇ.ప్రియాంక (సూరంపాలెం ప్రగతి), పి.మౌనిక, పి.లహరి (చీరాల ఇంజినీరింగ్‌), ఆర్‌.సాయిలక్ష్మి ప్రసన్న (నున్న వికాస్‌), ఎల్‌.భార్గవి(విజయనగరం జేఎన్‌టీయూ), ఎ.కీర్తి, జి.నాగబిందు (గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌), ఎం.జ్యోతి (బూడంపాడు సెయింట్‌ మేరీస్‌), ఎల్‌.పుష్పలత (నర్సరావుపేట తిరుమల ఇంజినీరింగ్‌), ఎ.మాధురి(గుంటూరు ఎన్నారై) ఎంపికయ్యారని ప్రోగ్రామ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎం.శివశంకర్‌ తెలిపారు.  ఈ జట్టుకు ఈ నెల 31వ తేదీ వరకు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లోనే శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 6 వరకు తమిళనాడులోని కాంచీపురం సమీపంలోని చిట్టినాడు అకాడమీలో జరిగే దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల ఖోఖో బాలికల పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని చెప్పారు. కార్యక్రమంలో కాకినాడ జేఎన్‌టీయూ యూనివర్సిటీ డీన్‌ డాక్టర్‌ జీవీఎన్‌ ప్రసాద్, అబ్జర్వర్‌ డాక్టర్‌ బీపీ రాజు,  సెలక్షన్‌ కమిటీ మెంబర్స్‌ కె.వెంకట్రావు (విజయవాడ), ఎన్‌.ఆదినారాయణ (కాకినాడ), కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.నాగేశ్వరరెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.రవీంద్రబాబు, పీడీలు దేశపతి, లావణ్య, శ్రీనివాస్, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు