సినీ నిర్మాణానికి అనువైన ‘స్మార్ట్‌ సిటీ’

23 Dec, 2016 01:25 IST|Sakshi
  • ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌
  • కాకినాడ కల్చరల్‌ :
    చిత్ర నిర్మాణానికి అవసరమైన అన్ని హంగులూ ‘స్మార్ట్‌ సిటీ’ అయిన కాకినాడకు ఉన్నాయని ప్రముఖ హాస్యనటుడు బి.పృథ్వీరాజ్‌ అన్నారు. వ్యక్తిగత పనిపై కాకినాడ వచ్చిన ఆయన స్థానిక సరోవర్‌ పోర్టు హోటల్‌లో గురువారం బస చేశా రు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో కొద్దిసే పు ముచ్చటించారు. తా ను కాకినాడ సమీపంలో ఉన్న చొల్లంగి గ్రామం లో జన్మించానన్నారు. అందుకే కాకినాడ నగరం  అంటే తనకు ఎంతో ఇష్ణమన్నారు. ఇప్పటి వరకూ సుమారు 200 వందల  చిత్రాల్లో నటించాననీ, గుర్తింపు తెచ్చిన సినిమా ‘ఖఢ్గం’ అని తెలిపారు. ఆ సిని మాలో తాను చెప్పిన ’థర్టీ ఇయర్స్‌ ఇండ స్ట్రీ’ అనే డైలాగ్‌ బాగా పాపులర్‌ అయ్యిందన్నారు. దీంతో తనకు సినీ రంగంలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. తాను సినిమాల్లోకి రాకుంటే అ« ద్యాపకునిగా స్థిరపడేవాడినని చెప్పారు. తాను  ఇష్టపడే వ్యక్తి రఘుబాబు అని, అభిమానించే నటుడు ఎన్టీఆర్‌ అని, అభిమానించే నటీమణి  భానుప్రియ అని చెప్పారు. నిర్మాతలు కొత్త దర్శకులకు అవకాశం కల్పించాలన్నారు. తెలుగు పరిశ్రమలో పరభాషా నటుల వ్యామోహం  పెరగడం దురదృష్ణకరమన్నారు. ప్రస్తుతం తాను ఖైదీ నెంబర్‌ 150, కాటమరాయుడు, మిస్టర్, విన్నర్‌ చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలిపారు.
     
మరిన్ని వార్తలు