‘దుఃఖదాయిని’ పరిశీలన

24 Sep, 2016 21:43 IST|Sakshi
‘దుఃఖదాయిని’ పరిశీలన
తాడేపల్లి రూరల్‌: రైతుల పాలిట దుఖఃదాయిని కొండవీటి వాగుని శనివారం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సుప్రీమ్‌కోర్టు న్యాయవాది సంజయ్‌ ఫిరిక్‌ పరిశీలించారు. కొండవీటి వాగు హెడ్‌ స్లూయిజ్‌ నుంచి ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం, బ్రిడ్జిల వద్ద పరిశీలించిన ఆయన తెలుగు రాకపోయినప్పటికీ రైతులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కోర్టులో రైతుల తరఫున వాదించేందుకు ఆయన ఈప్రాంతంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. కొండవీటీవాగు నీటి ప్రవాహంతోపాటు రైతులకు కలిగే నష్టంపై ఆరా తీశారు. కృష్ణాయపాలెం వద్ద పాల వాగు, కొండవీటì æవాగుపై ఒక కిలోమీటరు దూరంలో ఆరు మలుపులు ఉన్నాయన్నారు. ఐదు ఆరు వందల ఎకరాలకు సాగునీరు అందించటమే గాకుండా భూగర్భ జలాలు నిత్యం ఉండడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. కృష్ణాయపాలెం, పెనుమాక డొంకరోడ్డులో ఒక రైతు పంట పొలంలో బోరు వేస్తుండగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన వెంట న్యాయవాదులు, రైతులు మల్లెల శేషగిరిరావు, గాంధీ, మానం బోసురెడ్డి, కళ్లం సాంబిరెడ్డి, గంగిరెడ్డి శంకర్, నరసమ్మ, పద్మారెడ్డి, రవిశంకర్‌నాయడు, సురేష్, రాము, తదితరులు  పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు