తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

9 Jul, 2013 13:12 IST|Sakshi

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరు మంజనసేవను టీటీడీ అధికారులు సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. ఆరుగంటల పాటు ఆలయంలో దర్శనాలనన్నింటిని రద్దు చేసి ఆలయాన్ని శుభ్రపరిచారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 11గంటల వరకు  గర్భాలయం నుండి మహాద్వారం వరకు ఆలయాన్ని శుద్ది చేశారు.

అర్చకులు సుగంధ ద్రవ్యాల లేపనాన్ని గర్భాలయ ప్రాకారాలకు పూశారు. దీంతో ఆలయం మొత్తం సువాసనలు వెదజల్లుతోంది. శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ.. యేటా నాలుగు సార్లు నిర్వహిస్తారు. ఈనెల 16న ఆణివారి ఆస్థానంను పురష్కరించుకొని  ఆలయ శుద్ది కార్యక్రమాన్ని టీటీడీ నిష్టగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, టీటీడీ ఈవో గోపాల్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

సాధారణంగా సంవత్సరంలొ నాలుగుసార్లు ఈ కోయిల్ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితి. ఉగాది, ఆణివార ఆస్ధానం, బ్రహ్మొత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు చేయబడినది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమొక్తంగా పూజాదికాలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు