కృష్ణవేణి విగ్రహ ఏర్పాటుపై చర్చ

29 Jul, 2016 21:42 IST|Sakshi
కృష్ణవేణి విగ్రహ ఏర్పాటుపై చర్చ
నాగాయలంక : 
స్థానిక శ్రీరామపాదక్షేత్రం పుష్కరఘాట్‌లో నది బ్యాక్‌డ్రాప్‌ అనుసంధానంగా కృష్ణవేణి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ప్రధాన మార్గానికి అభిముఖంగా నదిని తాకిస్తూ విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని కమిటీ సభ్యులతో ఆయన అభిప్రాయపడ్డారు. పుష్కరఘాట్‌ కేంద్రంగా జరిపే సాంస్కృతిక కార్యక్రమాలు, హారతి తదితర అంశాలపై చర్చించారు.  శ్రీరామపాదక్షేత్రం ఆలయాల పునర్నిర్మాణ పనులను కూడా బుద్ధప్రసాద్‌ పరిశీలించారు. ఏఎంసీ చైర్మన్‌ మండవ బాలవర్ధిరావు, ఎంపీపీ సజ్జా గోపాలకృష్ణ (జీకే), ఏఎంసీ మాజీ చైర్మన్‌ తుంగల కోటేశ్వరరావు, డీసీ చైర్మన్‌ అంబటి లక్ష్మణప్రసాద్, ఎంపీటీసీ తలశిల స్వర్ణలత, డీఈ ఎం.మారుతీప్రసాద్, లాఖిత కనస్ట్రక్షన్స్‌ అధినేత గడ్డిపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు