వ్యవసాయానికి కూలీల కొరత

26 Jul, 2016 17:45 IST|Sakshi
వ్యవసాయానికి కూలీల కొరత
  • 32 గ్రామాల్లోని వ్యవసాయ పంటలకు కూలీల కొరత
  • కూలీలకు డిమాండ్‌
  • జుక్కల్‌: ఖరీఫ్‌ సీజన్‌లో పంటల కలుపు తీసేందుకు కూలీలు దొరక్క పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం వేసవిలో ఉపాధిహామీ పనులు చేపట్టి వ్యవసాయ సీజన్‌ రాగానే ఉపాధిహామీ పనులు నిలిపివేసేవారు.ఈ ఏడాది ప్రభుత్వం హరితహారంలో భాగంగా కూలీలతో మొక్కలు నాటే పనులు చేపట్టడంతో వ్యవసాయ పనులకు రైతులకు కూలీల కొరత తీవ్రంగా ఏర్పడింది. మండలంలో 32 గ్రామాల్లోని వ్యవసాయ పంటలకు కూలీల కొరత ఉంది. ప్రస్తుతం పత్తి, సోయా, పెసర, మినుము పంటల్లో కలుపు తీయాల్సి ఉండడంతో కూలీలకు డిమాండ్‌ ఏర్పడింది. గతేడాది ఒక్కో మహిళ కూలీకి కానీ ఈ సంవత్సరం కూలీల కొరత తీవ్రంగా ఉండడతో ఒక్కో కూలీ ధర రూ.150 నుంచి  రూ.180 వరకు పెరిగిపోయాయి. ఉపాధీహామీ పథకంతో రైతులు అధిక నష్టాలపాలవుతున్నారు.
     
మరిన్ని వార్తలు