లీన్‌సిక్స్‌సిగ్మాతో నాణ్యమైన ఉత్పత్తులు

3 Sep, 2016 23:37 IST|Sakshi
లీన్‌సిక్స్‌సిగ్మాతో నాణ్యమైన ఉత్పత్తులు

రాజంపేట:  లీన్‌సిక్స్‌సిగ్మాతో నాణ్యమైన ఉత్పత్తులు ఉంటాయని నిపుణులు డా.జీ.శివకుమార్, జీ.మనోజ్‌లు అన్నారు. శనివారం అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాల (ఎఐటీఎస్‌)లో లీన్‌సిక్స్‌సిగ్మాపై జాతీయ అవగాహన సదస్సును నిర్వహించారు. వారు మాట్లాడుతూ మొట్టమొదటిగా సిగ్మాను 1986లో మోటారోలో కంపెనీ ఉపయోగించుకుందన్నారు. మంచి ఫలితాలు వచ్చాయన్నారు. సిక్స్‌సిగ్మా అనగా కల్చర్, టూల్స్, మెథడాలజి, ఈ మూడింటిని కలపడం వలన వచ్చేది సక్సెస్‌ అన్నారు. మెథడాలజి అనగా లోపాలు తగ్గించడం, ఉత్పత్తులు పెంచడం, వినియోగదారుని సంతృప్తి పరచడం, ఆదాయాన్ని పెంచే చేయడాన్ని మెథడాలజి అన్నారు. సిక్స్‌సిగ్మాను రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చునన్నారు. ఒకటి డీఎంఏఐసీ, రెండవది డీఎంఏడీవీ, డీఎంఏఐసీ అనగా ఉపయోగంలో ఉన్న ఉత్పత్తులకు ఆదాయాన్ని పెంచిలోపాలను తగ్గించే విధంగా చేయడమన్నారు. జీ.మనోజ్‌ లీప్‌కాన్సెప్ట్‌ గురించి వివరించారు.   ప్రిన్సిపాల్‌ నారాయణ మాట్లాడుతూ జాతీయసదస్సులు నిర్వహించడం వేదాల కాలం నుంచి ఉందన్నారు.  సిక్స్‌సిగ్మా ఇంప్లిమెంట్‌ చేయడానికి కంపెనీ యాజమాన్యం చొరవ తీసుకోవాలన్నారు.  కార్యక్రమంలో హెచ్‌వోడీ డా.వెంకటచలపతి,   విద్యానికేతన్‌(తిరుపతి) , ఎస్‌బీకెఆర్‌ (వాకాడు), సిదార్ధకళాశాల(పుత్తూరు), శ్రీ ఇన్సిట్యూట్‌(తిరుపతి)కి చెందిన అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు