సంక్షోభంలో రైతాంగం

16 Apr, 2017 22:59 IST|Sakshi

గార్లదిన్నె : జిల్లాను కరువు కమ్ముకొని వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిందని, అతివృష్టి, అనావృష్టి ప్రభావం వల్ల రైతుల బతుకులు దయనీయంగా మారాయని  ఏపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్‌ అన్నారు.  మండల పరిధిలోని ఇల్లూరు, కల్లూరు, గుడ్డాలపల్లి, కనంపల్లి, తిమ్మంపేట గ్రామాల్లో  కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కరువుపై రైతులతో ఆదివారం ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు.   ఆయా గ్రామాల్లో రైతులు సమస్యలను శైలజానాథ్‌ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  మూడేళ్లుగా ఆయకట్టుకు నీరు రాకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.  జిల్లాలో ఎప్పుడూ లేనివిధంగా కరువు తాండవిస్తోందన్నారు. 

భూగర్భజలాలు అడుగంటి  తాగునీరు కరువయ్యాయన్నారు. జిల్లాలోనే పంటలు సమృద్ధిగా పండే గార్లదిన్నె మండలంలోని ఇల్లూరు గ్రామంలో వరి, పండ్లతోటలు నీరులేక ఎండిపోయాయని తెలిపారు.  దీంతో గ్రామాల్లో ప్రజలు ఇప్పటికే 20 శాతం మంది   వలస పోయారన్నారు. అదేవిధంగా రైతులు కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించినా  బిల్లులు రాక కూలీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉపాధి బిల్లులు వచ్చినా బ్యాంకుల్లో అప్పులోకి జమ చేస్తున్నారని తెలిపారు. కరువు నివారణ చర్యల కోసం  ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.  కాంగ్రెస్‌ మండల కన్వీనర్‌ నాగరాజు, నగర అధ్యక్షుడు దాదా గాంధీ,  బీసీ సెల్‌ అధ్యక్షుడు రామాంజనేయులు,  తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను..

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌

వాలి స్ఫూర్తితో...