బుర్రిపాలెంలో శ్రీమంతుడు

8 May, 2016 13:55 IST|Sakshi
బుర్రిపాలెంలో శ్రీమంతుడు

గుంటూరు: ప్రిన్స్ మహేష్ బాబు గుంటూరు జిల్లా బుర్రిపాలెం వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం వచ్చిన 'శ్రీమంతుడు'కు గ్రామస్తులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సొంతూరు బుర్రిపాలెం. మహేష్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఇక్కడికి రావడం ఇదే తొలిసారి.

మహేష్ తన బావ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్తో కలసి వచ్చారు. మహేష్ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యమైంది. ఈ రోజు అభివృద్ధి పనులకు మహేష్ శంకుస్థాపన చేయనున్నారు. మహేష్ బాబు రాకకోసం బుర్రిపాలెం గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అభివృద్ధికి నోచుకోని తమ గ్రామ రూపురేఖలు మారిపోతాయన్న ఆశతో ఉన్నారు.

సొంత ఊరుకు ఏదైనా చేయకపోతే లావైపోతాం అన్న సందేశాన్ని చాటిన శ్రీమంతుడు సినిమాకు ముందే మహేష్‌బాబు బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు. మార్చిలో మహేష్ భార్య నమ్రత, సోదరి పద్మావతి ఈ గ్రామానికి వచ్చారు. అప్పట్లో నమ్రత ప్రకటించినట్టే రెండు నెలల్లోపే మహేష్ ఈ ఊరికి వచ్చారు.

మరిన్ని వార్తలు