రాజకీయ పార్టీగా మాలమహానాడు

24 Jul, 2016 20:42 IST|Sakshi
అభివాదం తెలుపుతున్న నాయకులు
  • సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయాలి
  • మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రామ్మూర్తి
  • రామగుండం : వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మాలమహానాడు రాజకీయ పార్టీగా అవతరిస్తుందని మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రామ్మూర్తి ప్రకటించారు. రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీలను మాలలు ఆదరించాలని కోరారు. నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఆదివారం ఏర్పాటు చేసిన మహానాడు చైతన్య సదస్సులో మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌ మాట తప్పారని, ఆయన రాజీనామా చేసేవరకూ మాలలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని సూచించారు. జనాభాలో 5శాతం ఉన్నవారు ముఖ్యమంత్రులు అవుతూ 85శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను శాసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 
    కొందరు స్వార్థం కోసం దళితులను విభజించేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. దళితుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలని, బడ్జెట్‌లో 20శాతం నిధులను ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించాలని కోరారు. అనంతరం పలువురు మహిళా ప్రతినిధులు రామ్మూర్తిని పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో మాల మహానాడు నియోజకవర్గ ఇన్‌చార్జి కోల శ్రీనివాస్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గడ్డం సుశీల, గాదం రాధ, కారంగుల రాము, కోల కనకయ్య, దేవి రాజలింగు, తీట్ల ఈశ్వరీ, గాదం శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు