కురుక్షేత్ర యుద్ధంతో వర్గీకరణ సాధిస్తాం

2 Jun, 2017 22:34 IST|Sakshi
కురుక్షేత్ర యుద్ధంతో వర్గీకరణ సాధిస్తాం
సామర్లకోట : 
మాదిగల హక్కుల సాధన కోసం 70 రోజుల పాటు 160 సభలను ఏర్పాటు చేసి మాదిగలను చైతన్యం చేస్తున్నట్లు ఎంఆర్‌పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పిఠాపురం రోడ్డులో ముత్యం రాజబాబు గ్రౌండ్‌లో జిల్లా నాయకుడు వల్లూరి నాని అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. 35 రోజులు ముగిసిందని, మిగిలిన 35 రోజులల్లో 10 సభలు నిర్వహించాల్సి ఉందన్నారు. మాదిగల హక్కులను సాధించడం కోసం అమరావతిలో జూలై 7వ తేదీన కురుక్షేత్ర సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐక్యతను చాటడానికి ప్రతి మాదిగ కురుక్షేత్ర సభకు హాజరు కావాలన్నారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. చంద్రబాబు 30 సార్లు ఢిల్లీ వెళ్లినా ఒక్కసారి కూడా వర్గీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రాలేదన్నారు. మాదిగ, మాలల మధ్య చంద్రబాబు అసమానతలను పెంచుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మందా వెంకటేశ్వర్లు, వల్లూరి నాని, వల్లూరి సత్యవతి, కాళ్ల లక్ష్మీ నారాయణ, బాలభద్రం, దివాకర్‌ తాతపూడి కృష్ణబాబు, సత్యనారాయణ, ఎ.పార్వతి, వల్లూరి సత్తి బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పక్ష సీనియర్‌ కౌన్సిలర్‌ మన్యం చంద్రరావు, ముస్లిం సంఘ నాయకులు, స్థానిక ఎంఆర్‌పీఎస్‌ నాయకులు మంద 
కృష ్ణమాదిగను ఘనంగా సత్కరించారు.
 
 
మరిన్ని వార్తలు