మందకృష్ణకు మాట్లాడే హక్కులేదు: పిడమర్తి

13 Aug, 2016 21:32 IST|Sakshi
మందకృష్ణకు మాట్లాడే హక్కులేదు: పిడమర్తి

దోమలగూడ: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాళ్లకు మొక్కి మాదిగల ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టిన మందకృష్ణకు మాదిగల గురించి మాట్లాడే హక్కులేదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి విమర్శించారు. మాదిగలు, ఉపకులాలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్ష చేపట్టారు. దీక్షలలో ఎంహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జెల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సముద్రాల సంపత్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి కందుకూరి బాబు మాదిగ,

రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కమకం కోమురయ్య మాదిగ, హైదరాబాద్‌ అధ్యక్షుడు ఐత రామకృష్ణ మాదిగ, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షులు రెడ్డిగాని రాజు మాదిగ తదితరులు కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీబావం ప్రకటించిన రవి మాట్లాడుతూ.. ఉద్యమించి హక్కులను సాధించుకోవాలని డాక్టరు బిఆర్‌ అంబేడ్కర్‌ చెబితే, ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు కాకుండా కాళ్లు మొక్కి సాధించుకోవాలనే రీతిలో మందకృష్ణ అగ్రకులాల వారికి మాదిగ జాతిని తాకట్టు పెట్టాడని విమర్శించారు.  
 

మరిన్ని వార్తలు