-

త్వరలో మీ ఇంటికి– మీ భూమి

1 Oct, 2016 23:25 IST|Sakshi
త్వరలో మీ ఇంటికి– మీ భూమి

అనంతపురం అర్బన్‌ : ‘ మూడోవిడత మీ ఇంటికి– మీ భూమి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన తేదీని ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుంది. గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తించండి. కార్యక్రమం సక్రమంగా నిర్వహించేందుకు లైసెన్డ్స్‌ సర్వేయర్ల సేవలను వినియోగించుకోండి.’’ అని సర్వేయర్లను జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. శనివారం స్థానిక డ్వామా హాల్లో సర్వే భూ రికార్డుల శాఖ ఏడీ మచ్ఛీంద్రనాథ్‌లో కలిసి మీ ఇంటికి– మీ భూమి అంశంపై సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు.  ఏసీ మాట్లాడుతూ మీ ఇంటికి– మీ భూమిలో వచ్చే సమస్యలను గుర్తించి సత్వరం పరిష్కంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

భూ లోక్‌ అదాలత్‌లో సర్వే సమస్యలను ఏ విధంగా అధిగమించాలి అనేదానిపై శాఖ అధికారులు, సర్వేయర్లకు స్పష్టత ఉండాలన్నారు. జిల్లాలో 24 డిప్యూటీ సర్వేయర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థానాల్లో గౌరవ వేతనం  లైసెన్డ్స్‌ సర్వేయర్లకు సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఇదివరకు వేలుగులో పనిచేసిన సర్వేయర్లకు ఈటీఎస్, ఆటోకాడ్‌లో శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. మీ కోసం, మీ సేవలో వచ్చే అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు.

మొక్కుబడి సర్వేను సహించను
    ప్రజాసాధికార సర్వే మొక్కుబడిగా చేస్తే సహించబోనని అధికారులకు జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం చెప్పారు. తప్పుల్ని సరిచేసి ఈనెల 10లోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌ నుంచి సర్వేపై అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సర్వేలో తప్పులు చేసిన ఎన్యుమరేటర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. సూపర్‌వైజర్లు తప్పని సరిగా వంద శాతం ఈకేవైసీని ఈ నెల 10లోగా పూర్తిచేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు