తేడా వస్తే సస్పెండవుతారు

26 Aug, 2016 21:58 IST|Sakshi
తేడా వస్తే సస్పెండవుతారు
సాగునీటి విడుదలలో  నిర్లక్ష్యం వద్దు 
ఇంజనీర్లకు మంత్రి కామినేని హెచ్చరిక 
కౌతవరం (గుడ్లవల్లేరు) :
సాగునీటి విడుదలలో ఇరిగేషన్‌ అధికారులు అలక్ష్యం చేస్తే సస్పెన్షన్లు తప్పవని వైద్య, ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్‌ హెచ్చరించారు. కౌతవరం ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం వచ్చారు. పంట పొలాల్లో నీరున్నా పైనున్న కొందరు రైతులు మళ్లీ తోడుకోవటం మంచి పద్ధతి కాదన్నారు. అలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉయ్యూరు నుంచి పుల్లేటికి రావలసిన వాటాను తీసుకురావాలని ఇరిగేషన్‌ సీఈ వై.సుధాకర్‌ను ఆయన కోరారు. అలాగే బల్లిపర్రు లాకుల గేట్లను వెంటనే తెరిపించాలని ఆదేశించారు. కాగా, వర్షాకాలంలో వచ్చే జబ్బుల నివారణపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
సగమే వరి నాట్లు : సీఈ సుధాకర్‌
జిల్లాలోని 13లక్షల హెక్టార్లకుగాను 7లక్షల వరకు వరి సాగవుతుందని ఇరిగేషన్‌ సీఈ సుధాకర్‌ తెలిపారు. అందులో 50శాతం వరకు మాత్రమే వరినాట్లు పడ్డాయన్నారు. మిగిలిన శాతం సాగు చేయాలంటే మరొక 10టీఎంసీల సాగునీటి అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రకాశం నుంచి 8వేల క్యూసెక్కులు, పట్టిసీమ నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. పులిచింతలలో 7టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. ఒకవేళ వర్షాలు పడితే ఆ నీటిని నిలిపివేస్తామన్నారు. 
 
>
మరిన్ని వార్తలు