నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు

13 Oct, 2016 22:29 IST|Sakshi
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు

– చంద్రబాబుపై మండిపడ్డ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి
హిందూపురం అర్బన్‌ : ప్రత్యేక హోదాతో పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయని చెప్పి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని  చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురం సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ నాయకత్వంలో గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమంలో జిల్లా నాయకులు మీసాల రంగన్న, సివిల్‌ సప్లయ్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ గోపాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి రవిశేఖర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్యాకేజీకి జైకొట్టి రాష్ట్రాన్ని మరో 20 ఏళ్లు వెనక్కి తోసేశారన్నారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగSభతి అంటూ నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు.

అనంతరం తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మూర్ఖత్వ పనికి హిందూపురం పారిశ్రామికంగా వెనుకపడిందన్నారు. హంద్రీనీవా నీళ్లు తెస్తామని బాలకష్ణ తొడలు కొట్టడమే సరిపోయింది.. కానీ ఈ ఏడాది కూడా రావడం కష్టమేనని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఇంకా రూ.3 వేల కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే అవకాశం ఉందని సూచించారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో మూడేళ్లయినా పూర్తి కావని విమర్శించారు.

గెలుపుతో టీడీపీ పతనం ప్రారంభం
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయంతో తెలుగుదేశం పార్టీకి పతనం ప్రారంభం కావాలని హిందూపురం సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ అన్నారు. ఓటరు నమోదులో నాయకులు, కార్యకర్తలు ముఖ్యభూమిక పోషించాలని కోరారు. ఉద్యోగ సంఘాల తరఫున సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేసిన వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించాలన్నారు. నవంబరు 20 లోపు ఓటరు నమోదులు పూర్తి చేయించి మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పారు. తర్వాత మీసాల రంగన్న మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో అంతా దోపిడీ సాగుతోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యూత్‌ కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, రాప్తాడు జిల్లా యూత్‌ నాయకులు అమర్‌నాథ్‌రెడ్డి, రాప్తాడు మండల నాయకులు వరప్రసాద్‌రెడ్డి, సూర్యనారాయణ, నంద, హిందూపురం బీ బ్లాక్‌ కన్వీనర్‌ మల్లికార్జున, మండల కన్వీనర్లు బసిరెడ్డి, నారాయణస్వామి, సదాశివరెడ్డి, నాగమణి, షామింతాజ్, కౌన్సిలర్లు, నియోజవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు