పెద్ద దర్గాలో నాగ అన్వేష్‌ ప్రార్థనలు

13 Nov, 2016 00:46 IST|Sakshi
పెద్ద దర్గాలో నాగ అన్వేష్‌ ప్రార్థనలు

కడప కల్చరల్‌: యువ సినీ నటుడు నాగ అన్వేష్‌ శనివారం కడప అమీన్‌పీర్‌ (పెద్ద) దర్గాను దర్శించుకున్నారు. దర్గా ముజావర్‌ అమీర్‌ ఆయనకు దర్గా గురువుల విశిష్ఠత, చరిత్ర గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన తొలుత దర్గాలోని ప్రధాన గురువుల మజార్‌ను, అనంతరం ఆ ప్రాంగణంలోని ఇతర గురువుల మజార్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించార. అనంతరం నాగ అన్వేష్‌ మాట్లాడుతూ తాను నటించిన వినవయ్యా రామయ్య చిత్రం విజయవంతమైందని, ప్రస్తుతం తాను హీరోగా నటించిన ఏంజిల్‌ చిత్రం త్వరలో విడుదల కానుందని తెలిపారు. ఆ చిత్రం విజయవంతం కావాలని దర్గా గురువుల ఆశీస్సుల కోసం వచ్చానని తెలిపారు.
 

మరిన్ని వార్తలు