నగదు రహిత లావాదేవీలు జరగాలి

15 Feb, 2017 00:43 IST|Sakshi
నగదు రహిత లావాదేవీలు జరగాలి
అనంతపురం అర్బన్  : జిల్లాలో నగదు రహిత లావాదేవీలు జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్షీ్మకాంతం ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్‌లో వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ చౌక దుకాణాల్లో నగదు రహిత లావా దేవీలు జరిపేందుకు పెం డింగ్‌లో ఉన్న 200 డీలర్ల ఖాతాలను వెంటనే మ్యాపింగ్‌ చేయా లన్నారు.  పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ డీలర్ల అభ్యర్థన మేరకు ఈ–పాస్‌ యం త్రాల ను ఎస్‌బీఐ సరఫరా చేయా లన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత బ్యాంకులు ఒక కరెంట్‌ ఖాతాను ప్రారంభించాన్నారు. 
 
వినతులు పరిష్కరించకుంటే చర్యలు    
అనంతపురం అర్బన్  : ‘ప్రజలు తమ సమస్యలను అధికారులు పరిష్కరిస్తారని నమ్మ కంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చి అర్జీలిస్తుంటారు..వాటిని గడువుదాటినా పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జేసీ బి.లక్షీ్మకాంతం హెచ్చరించారు. మంగâýæవారం ఆయన తన చాంబర్‌లో ‘మీ కోసం’ పెండింగ్‌ అర్జీలపై సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో అధికంగా పౌర సరఫరాల శాఖలో 6,764 అర్జీలు, గనులు భూగర్భ శాఖకు సంబంధించి 1,549, పరిశ్రమల శాఖలో 1,549, వ్యవసాయ శాఖలో 1,065, విద్యుత్‌ శాఖలో 1,430, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేష¯ŒSలో 1,139 అర్జీలు గడువు దాటినా పరిష్కారం కాలేదన్నారు.  
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా