నిత్యశ్రామికురాలు....

9 Mar, 2016 03:52 IST|Sakshi
నిత్యశ్రామికురాలు....

కోహీర్: ఆమెకు మహిళల హక్కులు తెలియవు, మహిళా దినోత్సవాలు అసలే తెలియవు. ఆమెకు తెలిసిందల్లా రోజంతా కష్టపడి సంపాదించి తాను బుక్కెడు బువ్వతిని అంగవికలుడైన తన కొడుకుకు పట్టెడన్నం పెట్టడం మాత్రమే. అంతమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టాడు. చిన్నకొడుకు ప్రమాదంలో కన్ను కోల్పోయి అంగవికలుడై పనిచేయలేకపోతున్నాడు. ఏడు పదుల వయసులోనూ అంతమ్మ నిత్యం శ్రమిస్తూనే ఉంటుంది.

వృద్ధాప్య పింఛను వస్తున్నా కుటుంబ పోషణకు చాలడంలేదు. పని దొరకపోతే పస్తులుండాల్సిన దుస్థితి.. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోజూ ఏదో ఒక పని చేస్తోంది. మంగళవారం పండుగపూట పని దొరకకపోవడంతో కానుగకాయ (జట్రోప) ఏరి డబ్బులు సంపాంచాలనుకొంది. తన మిత్రురాలు పెంటమ్మతో కలిసి కోహీర్ గ్రామానికి వచ్చింది. యువకులు సైతం ఎక్కడానికి భయపడే ఎత్తై కానుగ చెట్టు ఎక్కి రెండు చేతులతో కట్టె పట్టుకొని కాయలు రాల్చింది. వచ్చిపోయే ప్రజలు అంతమ్మ ధైర్యానికి హ్యాట్సాఫ్ తెలిపారు.

మరిన్ని వార్తలు