28న పాలిటెక్నిక్‌ స్పాట్‌ అడ్మిషన్లు

20 Jul, 2017 23:07 IST|Sakshi

మడకశిర : పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈనెల 28న ఉదయం 10గంటలకు స్పాట్‌ అడ్మిషన్లు ఉంటాయని ప్రిన్సిపల్‌ జి.కృష్ణమూర్తినాయుడు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్పాట్‌ అడ్మిషన్లలో పాల్గొనడానికి అర్హులన్నారు. ప్రధానంగా ఈఈఈ, డీటీటీ కోర్సులకు మాత్రమే స్పాట్‌ అడ్మిషన్లు ఉంటాయన్నారు. స్పాట్‌ అడ్మిషన్‌లో పాల్గొనే విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాలిటెక్నిక్‌ కళాశాలలో హాజరు కావాలన్నారు.

మరిన్ని వార్తలు