తండ్రికి బదులు పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు..

28 Mar, 2016 16:19 IST|Sakshi
తండ్రికి బదులు పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు..

ఇల్లెందు(ఖమ్మం): తండ్రికి బదులు కుమారుడు పరీక్ష రాస్తూ పట్టుబడిన సంఘటన ఖమ్మం జిల్లా ఇల్లెందులో వెలుగుచూసింది. వీఆర్వోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి భవిష్యత్తులో పదోన్నతి పొందాలనే ఉద్దేశంతో ఓపెన్ టెన్త్ పరీక్షలు రాయలని నిర్ణయించుకున్నాడు. కానీ పాఠ్యపుస్తకాలు చదవలేక తన బదులు కొడుకుతో పరీక్ష రాయించాడు. ఇది గుర్తించిన అధికారులు కొడుకుపై మాల్‌ప్రాక్టీస్ కేసు పెట్టి పోలీసులకు అప్పగించారు.

గూండాల మండలం ముత్సాపురం గ్రామానికి చెందిన ఎం.జాన్ ఖమ్మంలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణత సాధించకపోవడంతో ప్రస్తుతం ఓపెన్ టెన్త్ ద్వారా విద్యార్హతను పెంచుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో తాను పరీక్షలు రాస్తే.. ఫెయిల్ కావడం ఖయమని నిర్ణయించుకొని తన బదులు డిగ్రీ పూర్తి చేసిన తన కొడుకును పరీక్షకు పంపాడు. ఇది గుర్తించిన ఎగ్జామినర్ పై అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు అతనిని పరీక్ష నుంచి బహిష్కరించి పోలీసులకు అప్పగించారు.

>
మరిన్ని వార్తలు