లారీని ఢీకొని స్కూటరిస్ట్‌ దుర్మరణం

9 Nov, 2016 01:47 IST|Sakshi
దొరవారిసత్రం : జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొని ఓ స్కూటరిస్ట్‌ దుర్మరణం పాలైన సంఘటన వేటగిరిపాళెం రోడ్డు సమీపంలో మంగళవారం జరిగింది. స్థానిక ఎస్‌ఐ సీహెచ్‌ కోటిరెడ్డి కథనం మేరకు.. నాయుడుపేటలోని రాజగోపాల్‌పురానికి చెందిన పవనేశ్వర్‌కుమార్‌ (36) బైక్‌పై సూళ్లూరుపేటకు వెళ్లి తిరిగి వెళ్తుండగా వేటగిరిపాళెం రోడ్డు వచ్చే సరికి ముందు వెళ్తున్న లారీ ఆకస్మికంగా ఆగింది. దీంతో వెనుకనే వేగంగా వస్తున్న బైక్‌ లారీని వెనుక భాగంలో ఢీకొంది. పవనేశ్వర్‌కుమార్‌ తలకు తీవ్రగాయాలై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు తడ ప్రాంతంలోని అపాచీ కంపెనీలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ తరలించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు