రోడ్డుపైకి వచ్చిన మయూరం

29 May, 2017 00:13 IST|Sakshi
రోడ్డుపైకి వచ్చిన మయూరం

మడకశిర రూరల్‌ : అటవీ ప్రాంతంలో మేత, నీరు లేక వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఆదివారం మండలంలోని గుడ్డంపల్లి సమీపంలోని ప్రధాన రోడ్డుపైకి నెమలి వచ్చింది. కొద్దిసేపు రోడ్డుపైనే అటూ ఇటూ తిరిగి సమీపంలో ఇళ్ల ముందున్న నీరు తాగింది. అనంతరం సమీపంలోని పొదల్లోకి వెళ్లింది. అధికారులు స్పందించి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం మేత, నీటి సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు