టీడీపీ పాలనపై సర్వత్రా అసంతృప్తి

11 Dec, 2016 23:46 IST|Sakshi
టీడీపీ పాలనపై సర్వత్రా అసంతృప్తి
- ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
- టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరిక
గుమ్మనూరు(చిప్పగిరి) : తెలుగుదేశం పార్టీ పాలనపై అన్నివర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. హొళగుంద ఒకటోవార్డు బీసీ కాలనీకి చెందిన టీడీపీ నాయకులు అడివప్ప, ఉలిగేష్, హనుమప్ప, వీరభద్ర, రాముడుతో పాటు మరో 30 మంది కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్సీపీ మండల నాయకులు కుమారస్వామి, రామకృష్ణ, వైస్‌ సర్పంచు శేఖన్న ఆధ్వర్యంలో  ఆదివారం గుమ్మనూరు వెళ్లి ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన   మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఈ కారణంగా అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు.  ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పోరాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జనం మద్దతు పెరుగుతోందన్నారు.
కాటసాని సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కార్యక్తలు
సంజామల మండలంలోని అక్కంపల్లె గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కాటసాని రామిరెడ్డి సమక్షంలో గ్రామానికి చెందిన మల్లేశ్వరరెడ్డి, నాగేశ్వరరెడ్డి, చంద్రమౌళి, ప్రసాదరెడ్డిలతో పాటు 50 కుటుం»êబాలు పార్టీలో చేరారు. గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమానికి వచ్చిన కాటసాని వీరందరికీ పార్టీ కండువా కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి.. తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. ఇటీవల పార్టీలో చేరిన నాయకున్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. నమ్మి ఓట్లేస్తే మోసం చేశారని..కార్యకర్తలను విస్మరించారని ఆరోపించారు. నమ్మించి మోసం చేసిన వారిని వచ్చే ఎన్నికలలో భూస్థాపితం చేస్తామని ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. ఓట్లేసి గెలిపించిన కార్యకర్తలనే కాపాడుకోలేని వ్యక్తి సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారన్నారు. ఇలాంటి చేతకాని వ్యక్తి ఎమ్మెల్యే పదవికి అర్హుడన్నారు.  డబ్బుతో ఏదైనా సాధిస్తానని ఎమ్మెల్యే అనుకుంటున్నారని.. ప్రజల విశ్వాసం పొందలేని వ్యక్తి రాజకీయాల్లో రాణించలేరని అన్నారు. గ్రామంలో ప్రజలకోసం పని చేసిన తమ కార్యకర్త అన్నయ్య మరణించడం తనను బాధిస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుండం వెంకట సూర్యప్రకాష్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కర్రా హర్ష వర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు చిన్నబాబు, పార్టీ నపాయకులు మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, గాధంశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 

 

మరిన్ని వార్తలు