ఊట్కూర్‌లో పోలీస్‌ పికెటింగ్‌

7 Aug, 2016 18:53 IST|Sakshi
ఊట్కూర్‌ భవాని మందిర్‌ వద్ద పికెటింగ్‌
ఊట్కూర్‌ : మండల కేంద్రంలో శనివారం రాత్రి నాగుల పంచమి సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి స్థానిక పాతపేట వీధిలో బావిపక్కన ఉన్న నాగుల విగ్రహాల పరిసరాలను శుభ్రం చేస్తుండగా ఒక వర్గంవారు పోలీసులకు సమాచారం అదించారు. దీంతో ఎస్‌ఐ సిబందితో వచ్చి అక్కడివారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు వీడియో, ఫొటోలు తీశారు. దీంతో విషయం తెలుసుకున్న మహిళలు, యువకుల వచ్చి దేవాలయం వద్ద బురద కావడంతో మట్టివేస్తున్నామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గతంలో ఇక్కడవున్న కొన్ని నాగుల విగ్రహాలను ఒక వర్గం వారు బావిలో వేశారని ఆరోపించారు. వెంటనే పోలీసులు ఇక్కడినుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు.  విషయం తెసుకున్న కాంగ్రెస్‌ నాయకుడు కుంటిమారి లక్ష్మన్న, స్థానికులు అశోక్, వెంకటప్ప వచ్చి మహిళలు, యువకులను శాంతింపజేశారు. పోలీసులు అతిగా ప్రవర్తిస్తు రెండు వర్గాల వారిని రెచ్చగొడుతున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎస్‌ఐని వివరణ కోరగా నాగుల పంచమి సందర్భంగా గ్రామంలో పలుచోట్ల పికెటింగ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మరిన్ని వార్తలు