చింటూ ఇంటి వద్దకు వెళ్లి ఆగిన జాగిలాలు

17 Nov, 2015 17:41 IST|Sakshi
చింటూ ఇంటి వద్దకు వెళ్లి ఆగిన జాగిలాలు

చిత్తూరు: మేయర్ కఠారి అనురాధ హత్య కేసులో బంధువుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు భావిస్తున్నారు. కఠారి మోహన్ బావమరిది చింటూ ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్నారు. పోలీసు జాగిలాలు కూడా అతడి ఇంటి వద్దకు వెళ్లి ఆగడంతో అనుమానాలకు బలపడుతున్నాయి.

మోహన్, చింటూలకు మధ్య చాలాకాలంగా ఆధిపత్య, ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఎంటెక్ చదువుకున్న చింటూ నేరచరిత్ర కలిగివున్నాడు. 2004లో ఓ హత్య కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు. పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగి పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. పోలీసులు తన కేసు పట్టించుకోలేదని పలుమార్లు మీడియా ముందు చింటూ వాపోయినట్టు తెలిసింది.

కాగా చింటూ నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో తనకు సెక్యురిటీ పెంచాలని ఎస్పీ కార్యాలయానికి అనురాధ ఇటీవల లేఖ రాసినట్టు తెలిసింది. ఈరోజు ఆమె ఎస్కార్ట్ సెలవులో ఉన్నట్టు సమాచారం. కార్పొరేషన్ కార్యాలయంలో సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదని తెలుస్తోంది. కాగా చింటూ లొంగిపోయాడని ప్రచారం జరుగుతోంది. చింటూ అరెస్ట్ ను పోలీసులు ధ్రువీకరించలేదు. మరోవైపు చింటూ ఇంటిపై మేయర్ మద్దతుదారులు దాడి చేశారు. మూడు వాహనాలను ధ్వంసం చేశారు.
 

మరిన్ని వార్తలు