నిరాశజనకంగా మామిడి పూత

5 Jan, 2017 22:47 IST|Sakshi

చెన్నూర్‌ : జిల్లాలో ఈసారి మామిడి నిరాశజనకంగా వచ్చింది. మామిడి పూతపై రైతులు పెట్టుకున్న గంపెడు ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. వచ్చిన పూతను దక్కించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో బెల్లంపల్లి, నెన్నల, జైపూర్, లక్సెట్టిపేట, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, జన్నారం, మండలాల్లో ఎనిమిది వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. మామిడి పూత  డిసెంబర్‌ చివరి వారంలో ప్రారంభమై జనవరి మాసంలో  – మిగతా 2లోu  పూర్తిగా రావాల్సి ఉంటుంది. ఇప్పటికి 50 శాతం పూత మాత్రమే వచ్చింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వేలాది రూపాయల మందులు పిచికారీ చేసినా లాభం లేకుండాపోయిందని ఆందోళన చెందుతున్నారు.

మామిడిపైనే రైతుల ఆశలు..
గతేడాది మామిడి పంట నిరాశ పరిచింది. ఈ ఏడాదైనా పూత మంచిగా వచ్చి కాత అనుకున్నట్లుగా వస్తే నాలుగు రాళ్లు వెనకేసుకుందామని రైతులు ఆశపడ్డారు. మామిడి పంట ఆశించిన మేరకు వస్తే చేసిన అప్పులు తీర్చుకొవచ్చనుకున్నారు. పూత పూర్తిస్థాయిలో రాకపోవడంతో వచ్చిన పూతను దక్కించుకునేందుకు వేలాది రూపాయల మందులను పిచికారీ చేశామని మామిడి రైతు నాయిని కిష్టయ్య తెలిపారు.

జిల్లా మామిడికి భలే డిమాండ్‌...
జిల్లాలోని మామిడికి దేశ, విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. తినేందుకు ఉపయోగించే మామిడి పండ్లు రకాలతోపాటు పచ్చడి మామిడి కాయలకు జిల్లా పెట్టింది పేరు. అమెరికా లాంటి దేశాల్లో ఉన్న తెలుగువారందరూ జిల్లాలోని పచ్చడి మామిడి కాయలంటేనే మక్కువ చూపడం విశేషం. మామిడి సీజన్‌ ప్రారంభం అయితే గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు జిల్లాలో మకాం వేస్తారు. చెరుకు రసం, బంగెనపల్లి, దసరి, పెద్ద రసాలు, తొతపరి, కొత్తపల్లి కొబ్బరి, హిమన్‌పసంద్, జహంగిర్, గుడుండాలాంటి మేలైన రకాల తోటలను పంట కాలం వరకు కౌలుకు తీసుకొని వ్యాపారం సాగిస్తుంటారు. ఏటా జిల్లా నుంచి వివిధ రాష్ట్రాలతోపాటు వివిధ దేశాలకు పది వేల టన్నులకు పైగా మామిడి రవాణా అవుతుందని వ్యాపారులంటున్నారు. పూతను చూసినట్‌లైతే దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు