రైలు ప్రమాదాల నివారణకు చర్యలు

2 Dec, 2016 22:17 IST|Sakshi
తనిఖీలు నిర్వహిస్తూ అధికారులు వచ్చిన ప్రత్యేక రైలు
– హైదరాబాద్‌ డీఆర్‌ఎం అరుణాసింగ్‌
 
వెల్దుర్తి రూరల్‌: రైలు ప్రమాదాలు జరుగకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు హైదారబాద్‌ డివిజనల్‌ ఆర్‌ఎం అరుణాసింగ్‌ తెలిపారు. శుక్రవారం ఆమె ప్రత్యేక రైలులో తనిఖీలు నిర్వహిస్తూ సాయంత్రం వెల్దుర్తి రైల్వేస్టేషన్‌నుకు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ మధ్య జరిగిన రైలు ప్రమాదాలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి.. ఆదేశాలు జారీ చేయడంతో తనిఖీలు నిర్వహిస్తున్నానమన్నారు. గేట్‌మెన్‌ త్వరగా గేటు తెరిచేలా, వేసిన గేటును తెరిచేందుకు ప్రజలు ప్రయత్నించకూడదన్నారు. రైల్వే ట్రాక్‌ల సమీపంలో ఎక్కడా చెత్త వేయడం కాని, చెత్తను, లేక చెట్లను అంటించడం కాని చేయరాదన్నారు. ప్రయాణికులు సైతం తమ ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉంటూ రైల్వే వారి సూచనలు పాటించాలన్నారు. అనంతరం రైల్వే స్టేషన్‌లోని పలు సేఫ్టీ పరికారాలను, సిగ్నల్స్‌ను, సాంకేతిక పరికారాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తనిఖీలో ఆమె వెంట సీనియర్‌ డీఎస్‌ఓ రవికుమార్,  సీనియర్‌ డీఓఎం రాజ్‌కుమార్, సిగ్నల్స్‌ డీఎస్‌టీఈ రాజీవ్‌ గంగూలీ,  ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులు, ఆర్‌పీఎఫ్‌ అధికారులు పాల్గొన్నారు. వెల్దుర్తి స్టేషన్‌ మాస్టర్‌ నాగేంద్ర, సిబ్బంది ఉన్నారు.  
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు