‘లా’ కమిషన్‌ సిఫారసులపై నిరసన

22 Apr, 2017 00:01 IST|Sakshi
‘లా’ కమిషన్‌ సిఫారసులపై నిరసన
కర్నూలు(లీగల్‌): ‘లా’ కమిషన్‌ (న్యాయవాదుల సవరణ బిల్లు 2017) సిఫారసులను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం శుక్రవారం మధ్యాహ్నం విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేసింది. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పిలుపు మేరకు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.చాంద్‌బాషా అధ్యక్షతన  నా​‍్యయవాదులు  సవరణ బిల్లు ప్రతులను జిల్లా కోర్టు  ఎదుట దహనం చేశారు.  కొద్దిసేపు ‘లా’ కమిషన్‌ చైర్మన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
అనంతరం బార్‌ కౌన్సిల్‌ సభ్యులు పి.రవిగువేరా మాట్లాడుతూ మే 2వ తేదీన న్యూఢిల్లీలో బార్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి జిల్లాలోని న్యాయవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వాసు మాట్లాడుతూ ‘లా’ కమిషన్‌ ప్రతిపాదించిన సిఫారసులను వ్యతిరేకించాలని ఎంపీలను కలవనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు ఓంకార్, పి.సుంకన్న, కోటేశ్వరరెడ్డి, రంగా రవికుమార్, శ్రీవత్స, జలందర్, బాలు, నాగరాజు, ఎ.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు