పిండ ప్రదానాలకు షెడ్డు నిర్మాణం

29 Jul, 2016 02:31 IST|Sakshi
పిండ ప్రదానాలకు షెడ్డు నిర్మాణం

గొల్లపూడి(విజయవాడరూరల్‌) : గొల్లపూడి పుష్కరఘాట్‌వద్ద యాత్రికుల సౌకర్యార్థం దేవాదాయశాఖ పిండప్రదానాలకు షెడ్డు నిర్మిస్తోంది.  కృష్ణానది ఒడ్డున ఈ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించుకునేందుకుగాను రూ.1.70లక్షలతో షెడ్డును నిర్మిస్తోంది. గురువారం షెడ్డునిర్మాణం పనులు ప్రారంభించారు. నిర్మాణం పనుల పర్యవేక్షణ పంచాయతీరాజ్‌ నిర్వహిస్తోందని పంచాయతీరాజ్‌ ఏఈ సురేంద్ర తెలిపారు.
 

మరిన్ని వార్తలు