45 మండలాల్లో వర్షం

11 Sep, 2016 22:51 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు 45 మండలాల్లో వర్షం కురిసింది. అయితే అందులో మోస్తరుగా వర్షాలు పడింది మాత్రం 8 మండలాల్లోనే. అత్యధికంగా అనంతపురం 40.2 మి.మీ, కూడేరు 36.9 మి.మీ, బుక్కరాయసముద్రం 29.7 మి.మీ, బ్రహ్మసముద్రం 28.6 మి.మీ, కళ్యాణదుర్గం 27.7 మి.మీ, తాడిపత్రి 25 మి.మీ, ఆత్మకూరు 18.6 మి.మీ, కంబదూరు 10.1 మి.మీ వర్షం పడింది. ఇక రాప్తాడు, గార్లదిన్నె, నార్పల, కణేకల్లు, ఉరవకొండ, గార్లదిన్నె మండలాల్లో తేలికపాటి వర్షం కురవగా మిగతా మండాలల్లో తుంపర పడింది.

సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ప్రస్తుతానికి కేవలం 9.7 మి.మీ నమోదు కాగా అందులో ఈ ఒక్కరోజే 4.9 మి.మీ నమోదైంది. ఈ నెలలో అగళి, ఓడీ చెరువు, అమడగూరు, కదిరి, బుక్కపట్టణం, గాండ్లపెంట, ఎన్‌పీ కుంట, కుందుర్పి, వజ్రకరూరు, బొమ్మనహాల్, డి.హిరేహాల్‌ తదితర మండలాల్లో కనీసం చినుకు కూడా పడకపోవడం ఇంకా ఒక మి.మీ కూడా వర్షపాతం నమోదు కాని పరిస్థితి నెలకొంది. కేవలం 12 నుంచి 15 మండలాల్లో మాత్రమే చెప్పుకోదగ్గ వర్షం పడింది.

మరిన్ని వార్తలు