గ్రామాల్లో రాఖీ సందడి

17 Aug, 2016 18:24 IST|Sakshi
జిన్నారంలోని ఓ షాపులో రాఖీలు

జిన్నారం: రాఖీ పండుగ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. గురువారం రాఖీ పండుగ కావటంతో గ్రామాల్లోని  దుకాణాలు వివిధ రకాల రాఖీలతో కళకళలాడుతున్నాయి. చిన్నారులు, యువతులు, మహిళలు రాఖీ దుకాణాల వద్ద బారులు తీరారు. 

వివిధ రకాల రాఖీలను కొనుగోలు చేసేందుకు మహిళలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామాల్లోనీ స్వీటు షాపులు కూడా కళకళలాడుతున్నాయి. మండల కేంద్రమైన జిన్నారంలోని వివేకానంద పాఠశాలల్లో ప్రిన్సిపల్‌ కరుణాసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలోరాఖీ పండుగను బుధవారం నిర్వహించారు. చిన్నారులకు రాఖీ పండుగ ప్రాముఖ్యను ప్రముఖ విద్యావేత్త వివరించారు.

పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులు కూడా తోటి ఉపాధ్యాయులకు రాఖీ కటి్‍్ట పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రతిభా విద్యానికేతన్‌ పాఠశాలలో ప్రిన్సిపాల్‌ సార శ్రీినివాస్‌ ఆధ్వర్యంలో కూడా రాఖీ పండుగ ఉత్సవాలను నిర్వహించారు. విద్యార్థులకు రాఖీ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు రాఖీ ఆకారంలో ఏర్పడటం ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. రాఖీప ండుగను ఘనంగానిర్వహించుకుంటామని మహిళలు, యువతులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు