ప్రశ్నల హీరో ఎక్కడ?

14 Jun, 2016 08:40 IST|Sakshi

ఏరు దాటాక తెప్ప తగలబెట్టే రకం చంద్రబాబు : రత్నాకర్

రాజమహేంద్రవరం : అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తానంటూ ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడా కనిపించకుండా తిరుగుతున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్‌ఎస్ రత్నాకర్ విమర్శించారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ముద్రగడ దీక్షకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు.

దీక్షలో ఉన్న ముద్రగడను పరామర్శించేందుకు ఇద్దరు ఎస్పీలను అనుమతి అడిగినా ఒప్పుకోకపోవడం దారుణమన్నారు. ఆయనను ఓ ఉగ్రవాదిలా చూస్తోందన్నారు. చంద్రబాబు నైజం చూస్తుంటే ఏరు దాటాక తెప్ప తగలపెట్టే రకం గుర్తొస్తోందని ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులను, కాపుల రిజర్వేషన్లు పేరుతో కాపులను అణగదొక్కేందుకు చూస్తే చంద్రబాబుకు రాజకీయ సన్యాసం తప్పదన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా