రోడ్డు ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యం

14 Jun, 2017 23:30 IST|Sakshi
రోడ్డు ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యం
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) :
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం ఎస్పీ అధ్యక్షతన జాతీయ రహదారుల పరిధిలో ఉన్న పోలీస్‌ అధికారులకు ఐటీకోర్‌పై అవగాహన, శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఇప్పటికే ప్రత్యేక సర్వే బృందాలతో అధ్యయనం చేసినట్టు తెలిపారు. రాష్ట్ర డీజీపీ నండూరు సాంబశివరావు ఉత్తర్వుల మేరకు ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించామన్నారు. డీజీపీ ఆధ్వర్యంలో ఈ నెల 9,10వ తేదీల్లో విశాఖపట్టణంలో వర్క్‌షాపు నిర్వహించి, రోడ్డు సేఫ్టీ యాప్‌ను ఆవిష్కరించారని చెప్పారు. ఎక్కడ అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయో ఈ యాప్‌ వల్ల తెలుస్తుందని, తద్వారా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ–2 సుంకర మురళీమోహన్‌ నోడల్‌ అధికారిగా నియమితులైనట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఐటీ కోర్‌పై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ దామోదర్, ట్రాఫిక్‌ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, ఎస్‌బీ డీఎస్పీ విజయభాస్కరరెడ్డి, డీసీఆర్‌బీ సీఐ కృష్ణారావు, సీఐ సుధాకర్, ఎన్‌హెచ్‌–16 పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు