బిల్లు చూస్తే షాక్‌

22 Sep, 2016 01:29 IST|Sakshi
బిల్లు చూస్తే షాక్‌
 
  • రెండు బల్బులకు రూ.32 వేలు బిల్లు
  •  లబోదిబోమంటున్న గిరిజనులు
చిల్లకూరు : మండలంలోని తిప్పగుంటపాళెం గిరిజన కాలనీలోని ఓ పక్కాఇంటికి  విద్యుత్‌ శాఖ రూ.32వేలు బిల్లు మంజూరు చేసింది. కేవలం రెండు బల్బులు, ఓ టీవీకి భారీగా బిల్లు ఇవ్వడంతో గిరిజనులు షాక్‌కు గురయ్యారు. జీవితాంతం కూడా చెల్లించని మొత్తాన్ని బిల్లుగా ఇవ్వడంతో ఎలా కట్టాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిప్పగుంటపాళెం గిరిజన కాలనీకి చెందిన వెంకటరమణయ్య పక్కాఇంటికి(సర్వీసు నంబర్‌ 3111147000452) ప్రతి నెలా రూ.80నుంచి రూ.130లోగా బిల్లు చెల్లిస్తుండగా, రెండు నెలల క్రితం ఒక్కసారిగా రూ.24 వేలు బకాయి ఉన్నట్లుగా బిల్లు ఇచ్చారు. మరుసటి నెలలో రూ.32,620 బిల్లును చేతిలో పెట్టారు. వెంకటరమణయ్య రూ.32లే కదాని బిల్లు చెల్లించేందకు వెళ్లగా, రూ.32 వేలు బిల్లు అని అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా బిత్తరపోయాడు. విద్యుత్‌శాఖాధికారులను కలుసుకోగా అందులో సగమైనా చెల్లిస్తేనే మిగిలిన బిల్లును సర్దుబాటు చేస్తామని చెప్పారని వెంకటరమణయ్య భార్య పద్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ చినస్వామినాయక్‌ను వివరణ కోరగా బిల్లును పరిశీలించి సవరిస్తామన్నారు.
మరిన్ని వార్తలు